ఎల‘మంద’హాసం
భీంపూర్ మండలం కొత్త పంచాయతీ గుబ్‌డి గ్రామం. జిల్లా కేంద్రా నికి 50 కిలోమీటర్ల దూరాన తెలంగాణ రాష్ట్ర సరిహద్దున పెన్‌గంగ ఒడ్డున ఉన్నది ఈ గ్రామం. ఇక్కడ తరాలుగా వ్యవసాయంతో పాటు గొర్రెల పెంపకం వృత్తిగా చేస్తున్నారు.
- గొర్రెల పెంపకంలో గుబ్‌డి మేటి
- సరికొత్త ఉపాధితో సరిహద్దు గ్రామం ముందుకు
- పలు గ్రామాలకు ఆదర్శం
- తరాల నుంచి గొర్రెల పెంపకంతోపాటు వ్యవసాయం
- ప్రభుత్వ చేయూతతో మరింత లబ్ధి
భీంపూర్, జూన్ 12 : భీంపూర్ మండలం కొత్త పంచాయతీ గుబ్‌డి గ్రామం. జిల్లా కేంద్రా నికి 50 కిలోమీటర్ల దూరాన తెలంగాణ రాష్ట్ర సరిహద్దున పెన్‌గంగ ఒడ్డున ఉన్నది ఈ గ్రామం. ఇక్కడ తరాలుగా వ్యవసాయంతో పాటు గొర్రెల పెంపకం వృత్తిగా చేస్తున్నారు. 800 వరకు జనాభా ఉన్న గుబ్డిలో 250 ఇళ్లు ఉన్నాయి. ఆ తరంనుంచి మహాజన్ జాలబక్కన్న, తూడి రాములు కుటుంబాలు సహా ఎన్నో కుటుంబాలు గొర్రెల పెంపకాన్ని చేపట్టాయి. మందకు మంద పెంపు చేస్తూ ఏటా కనీసంగా రూ.50వేల నుంచి 2 లక్షల వరకు గొర్రెలను అమ్ముతూ ఆదాయం పొందుతున్నారు. దీంతో మిగిలిన మందల పోషణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
కలిసి వచ్చిన భౌగోళిక స్వరూపం..
ఈ గ్రామం పెన్‌గంగ పరీవాహక ప్రాంతం కావడంతో పశువులు, జీవాల దాహార్తికి ఇబ్బంది లేదు. ఇక సమీప చిట్టడవి, సూర్యగుట్ట ప్రాంతా లు ఎద్దులు, ఆవులు, గేదెలు, జీవాలను మేప డానికి పనికి వస్తున్నాయి. దాదాపుగా జీవాల మందలు ఉన్నవారు సొంతంగానే వీటిని మేపడం సంరక్షణ చేయడంతో లాభాలు కలిసివస్తున్నా యి. అడవిలో తోడేళ్లు, చిరుత పులుల నుంచి రక్షణకు ప్రతి మందకు ఒక జాగిలం ఉంటుంది .
ప్రభుత్వ గొర్రెల యూనిట్లు..
మొదటి విడుతలో ఇక్కడి 40 యాదవ కుటుంబాలకు గొర్రెల యూనిట్లు వచ్చాయి. ఇక రెండో విడుతలో మరో 42 వరకు యూనిట్లు అందజేయనున్నారు. కాగా సొంతంగానే మంద లు పెంచుకుంటున్న వారు చాలా మంది ఉన్నా రు. జీవాల పెంపు కోసం కొందరు సొంతంగా షెడ్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం కులవృత్తు లకు ఎంతో సాయం చేస్తున్నది. ఇక మందకు మంద చేస్తూ ఆర్థికంగా ఎదగాల్సిన బాధ్యత లబ్ధిదారులదని సర్పంచ్ ఎల్పుల ప్రతాప్ యాదవ్ పేర్కొంటున్నారు.
సర్కారు రుణపడి ఉంటాం..
మా కుటుంబానికి 4.23 ఎకరాల భూమి ఉన్నది. రైతుబంధు మొదలయినంక మేము ఆ పైసలు పొదుపుచేసుకుంటున్నాం. ఆ పైసలతోని పెన్‌గంగ నుంచి 120 పైపులేసి చేండ్లకు నీల్లు ఇస్తున్నం. ఇగ రెండు పుట్లు (40)గొర్రెలు పెంచు తున్నం. ఇంక సర్కారు ఇచ్చేటియి అస్తయి. యేటా మేము రూ.30 వేల గొర్రెలు అమ్ముతం. గొర్రెల పెంపకంతో కలిసి వస్తున్నది.గొర్రెల ఎరువు చేండ్లకు పనికిఅస్తది . మా గ్రామంలో గిట్ల గొర్రెలు, పాడి ఆవులు ,బర్రెలతోని నాలుగు పైసలు మిగుల్తున్నయి. సీఎం కేసీఆర్ సారు గొల్ల కుర్మలకు మందలు ఇచ్చుడు అనేది మామూలు మాట కాదు. మేము సర్కారుకు ఎప్పటికీ రుణపడి ఉంటం..
– దప్కల గజానన్యాదవ్, రైతు(గుబ్‌డి)
తాతల కాలం నుంచి పెంచుతున్నం..
మా గ్రామంల తాతముత్తాతల కాలం నుంచి గొర్రెల పెంపకం జరుగుతున్నది. ఇప్పుడు సర్కా రు ఇస్తున్న మందలను మంచిగ పెంపకం చేసుకునుడు. ఈ అనుభవం పనికి అస్తున్నది. ఇప్పుడంటె ఎటు జూసినా యాదవ కుర్మలకు సీఎం సార్ ఇచ్చిన గొర్రెల మందలే కనిపిస్తు న్నయి. గనీ మా గ్రామంల నయితే గీ జీవాల పెంపకం తరాలనుంచి ఉన్నది. మేము కూడా మందలు పెంచుతున్నం. ఈ సారి సర్కారు ఇచ్చేటియి అస్తయి . ఇగ జీవాలు సర్కారు పశువుల దవాఖాండ్లళ్ల జీవాలు, పశువులకు అన్ని మందులు, టీకాలు ఉచితంగా అందిస్తున్నది. కష్టపడి పెంపకం చేసుకునేటోళ్లకు గీ సర్కారు మస్తు సౌలత్ చేస్తున్నది.
– అంగ కిష్టన్న యాదవ్, రైతు, గుబ్‌డి
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- farming
- sheep
- Sheep breeding
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

