దండేపల్లి : చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించి ఆదుకోవాలని కోరుతూ మంచిర్యాల (Manchiryala District ) జిల్లా దండేపల్లి మండలంలోని నాగసముద్రం మూల మలుపు వద్ద శనివారం రైతాంగం రోడ్డెక్కారు (Farmer Dharna) . ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంటలు చేతికొచ్చే దశలో అధికారులు, ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సకాలంలో సాగునీరు ఇవ్వకుంటే ఇవ్వకుంటే పురుగుల మందు తాగుతామని హెచ్చరించారు. ఇప్పటికే 5 తడులు ఇచ్చారని, తమకు మాకు చేరింది ఒక్క తడేనని, దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే తిరిగి వచ్చే పరిస్థితి లేదన్నారు.
నీళ్లు ఇస్తామని చెప్పి అధికారులు తీరా పంటలు చేతికి వచ్చే దశలు చేతులెత్తేసారని వాపోయారు. స్థానిక ఎస్సై తహసీనుద్దీన్ సంఘటన స్థలానికి చేరుకొని నీటిపారుదల శాఖ అధికారులు, రైతులతో మాట్లాడించడంతో రైతులు ఆందోళన విరమించారు.