ఇంద్రవెల్లి, ఏప్రిల్ 18 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్‌కు చెందిన మహిళా రైతు డాకురే రంజనాబాయి చేనులో నిలువ ఉంచిన పంటలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రంజనాబాయి తన భూమిలో జొన్న, శనగ, గోధుమ సాగు చేసింది. మూడు పంటలు కోసి చేనులోనే కుప్ప లు పోసింది. చేనులోనే 20 పైపులను కూడా పెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు అగ్గి పెట్టడంతో మంటలు కుప్పలకు అంటుకున్నాయి. దీంతో పంటల కాలిపోవడంతో దాదాపు 2.04 లక్షల ఆర్థిక నష్టం జరిగింది.
బేలలో మక్క పంట
బోథ్, ఏప్రిల్ 18 : బోథ్ మండల కేంద్రానికి చెందిన కత్తూరి రాములు మక్క పంట శనివారం సాయంత్రం దగ్ధమైంది. రాములు నాలుగెకరా ల్లో మక్క వేశాడు. ప్రస్తుతం కోతకు రావడంతో కోసి మొదలుగ్గా ఉంచా డు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో చేనులో మంటలు వ్యాపించాయి. దా దాపు రెండెకరాల మక్క అగ్నికి అహుతైంది. రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.

భైంసాలో ఎకరం..
భైంసా టౌన్, ఏప్రిల్ 18 :భైంసా మండలంలోని మహాగాంలో విద్యుదాఘాతంతో శనివారం మక్క పంట దగ్ధమైంది. రౌతు రెడ్డి ఏడెకరాల్లో మక్క సాగు చేశాడు. హార్వెస్టర్ వెళ్లే సమయంలో విద్యుత్ తీగలను పైకి జరుపుతున్న క్రమంలో మంటలు చెలరేగి మక్క పంట దగ్ధమైంది. అలాగే సాకలి భోజన్నకు చెందిన మక్క పంట కూడా కాలిపోయింది.
సిరికొండలో రూ.4 లక్షల నష్టం
ఇచ్చోడ(సిరికొండ), ఏప్రిల్ 18 : సిరికొండ మండలంలోని రాంపూర్గూడ గ్రామంలో రాథోడ్ గణేశ్ కౌలుకు తీసుకొని ఐదెకరాల్లో మక్క వేశాడు. ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో మూడెకరాల పంట కాలిబుడిదైంది. వెంటనే గ్రామస్తులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. సుమారు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత కౌలు రైతు తెలిపాడు.
బుర్కపల్లిలో జొన్న..
బజార్హత్నూర్, ఏప్రిల్ 18 : బజార్హత్నూర్ మండలంలోని బురపల్లిలో శనివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గెడం దిలీప్‌కు చెందిన రెండెకరాల జొన్న దగ్ధమైంది. జాటివే కైలాష్కు చెందిన మోటార్ పైపులు, వైర్ కాలి పోయాయి. ఈ ప్రమాదం లో రూ.1.50 లక్షల నష్టం జరిగిందని బాధిత రైతులు తెలిపారు.