ఎదులాపురం, ఆగస్టు 20 : ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌లో మార్పులు చేస్తూ అనుకుంట గ్రామ రైతులకు తీవ్ర అన్యాయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో గల మాజీ మంత్రి జోగు రామన్న నివాసానికి చేరుకున్న వారు తమ సమస్యలు వివరించి, న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వకుండా అనుకుంట గ్రామస్తులను అయోమయానికి, ఆందోళనకు గురి చేయడం సరికాదన్నారు. అనుకుంట గ్రామస్తులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
గతంలో కలెక్టర్ హైమద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే, ప్లానింగ్ ప్రకారమే ఎయిర్ పోర్ట్ నిర్మాణ నిర్ణయాలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారని తెలిపారు. కొత్తగా డీపీఆర్ రూపొందించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్న భూములు 68 సర్వే నంబర్లో ఉన్నప్పటికీ, వాటిపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రైతు ప్రయోజనాలను పకన పెట్టి నిర్ణయాలు తీసుకున్నా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. అనుకుంటవాసులకు శాశ్వత పరిషారం లభించే వరకు వారి పక్షాన నిలబడి పోరాడుతామని రామన్న హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బండి దత్తాత్రి, మంచాల మల్లయ్య, కడదరపు అశోక్, రావుల రమేశ్, ఆప్ కం భూమయ్య, మోహిన్, రావుల సోమన్న, జకుల సత్యనారాయణ, బండి సాగర్, దూడ రాజేశ్వర్, ముఖ్యర శ్రీను, కమిటీ రమేశ్, సలీం తదితరులు పాల్గొన్నారు.