Mahananda Express Derail | సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం.. పట్టాలు తప్పిన మహానంద ఎక్స్‌ప్రెస్
Mahananda Express Derail | సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల మహానంద ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి పునరుద్ధరణ పనులు చేపట్టారు.
పాట్నా: సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల మహానంద ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ సంఘటన వల్ల ఆ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. (Mahananda Express Derail) 15483 అలీపుర్దువార్ జంక్షన్-ఢిల్లీ సిక్కిం మహానంద ఎక్స్‌ప్రెస్ ఆదివారం ఉదయం 4.12 గంటలకు బీహార్‌లోని ఆరా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్ రెండుకు చేరుకున్నది.
కాగా, ఢిల్లీ వెళ్లాల్సిన ఆ రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన సమయంలో సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో ససారం అప్ లైన్ వైపు సిగ్నల్ చూపించడంతో ఆ రైలు ముందుకు కదిలింది. అయితే స్టేషన్‌కు సుమారు 200 మీటర్ల దూరంలో అది పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్, ఎస్ఎల్ఆర్, హెచ్-1 కోచ్ చక్రాలు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన వల్ల ఆ మార్గంలో రైళ్ల రాకపోకలతకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు ఈ సమాచారం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు, సాంకేతిక బృందాలు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. పట్టాలు తప్పిన రైలు ఇంజిన్, బోగీలను ట్రాక్‌పైకి ఎక్కించే పునరుద్ధరణ పనులు చేపట్టారు.
ససారం లైన్ వైపు సిగ్నల్ మళ్లడానికి దారితీసిన పరిస్థితులు, ఆ రైలు తప్పుడు దిశలో ఎలా ప్రయాణించిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు.
3 coaches off the tracks, Zero injuries.
Mahananda Express derailed near Arrah, Bihar this morning engine + 2 coaches left the rails.
Delhi–Howrah line hit with delays/diversions.
Early reports point to a signal/router issue speed was low, which likely prevented casualties.… pic.twitter.com/Pgnu65P2xb— GlobePulses (@GlobePulses) September 6, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

