Sarangapur | నిర్మల్ జిల్లాలో జొన్నలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మార్కెట్ యార్డు వద్ద స్వర్ణ-నిర్మల్ రహదారిపై జొన్నలు కొనుగోలు చేయాలని మంగళవారం రైతులు ధర్నా నిర్వహించారు.
సారంగాపూర్, మే 19 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మార్కెట్ యార్డు వద్ద స్వర్ణ-నిర్మల్ రహదారిపై జొన్నలు కొనుగోలు చేయాలని మంగళవారం రైతులు ధర్నా నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. తహసీల్దార్ విజయ్కాంత్రావుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. తహసీల్దార్ కలెక్టర్ భవేశ్మిశ్ర దృష్టికి తీసుకువెళ్లి రెండు రోజుల్లో జొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సారంగాపూర్ మార్కెట్ యార్డులో జొన్నలు పోసి నెల రోజులు గడుస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి 20 రోజుల క్రితం ప్రారంభించారని, అప్పటి ఇప్పటివరకు గన్నీ బ్యాగులు లేక ఒక గింజా కూడా కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణంలో మార్పుల వల్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో జొన్నలు తడసి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

