కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రైతులు వేసిన పంటే మళ్లీ వేస్తూ బా గా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో యాసంగి లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసే లా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఇటీవల సదస్సులు కూడా నిర్వహించారు. రైతులు ఏళ్ల తరబడి పంట మార్పిడి చేయకపోవడంతో చీడపీడ వ్యాప్తి ఎక్కువై దిగుబడి తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు అ డుగులు వేయాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా గతంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కూరగాయలు, నూనె గింజలు, ఇతర ఆ రుతడి పంటలు సాగుచేసేలా ప్రోత్సహిస్తున్నారు. యాసంగిలో వరి సాగును తగ్గించి కూరగాయాలు, ఇతర పంటల సాగును ప్రోత్సహించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులకు రాయితీల్లో మొదటి ప్రాధాన్యమిస్తున్నారు.
దిగుబడిపై తీవ్ర ప్రభావం..
నేల భౌతిక స్థితి, స్వభావం పంటల దిగుబడిపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి ఉంటే భూసారం వృద్ధి చెం దుతుంది. చీడపీడలు దూరమవుతాయి. ఫలితం గా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చులు తగ్గుతాయి. రైతులు పంటల మార్పిడి చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. వాణిజ్య పంటల సాగును తగ్గించి ఆహార పంటలను సాగుచేస్తే రైతులకు అధిక దిగుబడులతోపాటు గిట్టుబాటు ధరలు కలిసి వస్తాయని అధికారులు సూచిస్తున్నారు. పం టల మార్పిడితో నేలలో భూసారం పెరిగి, పంట లు ఆశాజకంగా ఉంటాయని పేర్కొంటున్నారు.
తగ్గుతున్న కూరగాయల సాగు..
యేటేటా తగ్గిపోతున్న కూరగాయల సాగుతో మా ర్కెట్లో ధరలు పెరిగిపోతున్నాయి. దీనిని అధిగమించేందుకు, కూరగాయల కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా కాలనీలు ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు మధ్య దళారులు లేకుండా నేరుగా రైతు పండించిన కూరగాయలను వినియోగదారులకు అమ్ముకునేందుకు వీలుగా చర్యలు చేపట్టనున్నారు. పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రా మాలు, రవాణా వసతి ఉన్న మండలాలను ఎంపి క చేసిన అధికారులు.. కూరగాయల సాగు కు ముందుకొ చ్చే రైతులకు సబ్సిడీపై స్ప్రింక్లర్లు, డ్రిప్ లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. క్రాప్ కాలనీలపై త్వరలోనే రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సాగు పెరిగితేనే సమస్యకు పరిష్కారం..
జిల్లాలో అవసరానికి తగినట్లుగా కూరగాయల సాగువైపు రైతులను మళ్లీంచేందుకు ఉద్యానవన శాఖ ద్వారా ప్రభుత్వం చర్యలు చేట్టింది. కూరగాయల సాగుకు ముందుకొచ్చే రైతుల్లో ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతరులకు 90 శాతం సబ్సిడీపై స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. కూరగాయలు సాగుచేసే రైతులుకు పంట సస్యరక్షణ చర్యలు తీసుకునే విధానాలపై అవగాహన కూడా కల్పిస్తారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో కూరగాయల కాలనీలను ముందు ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయ పరికరాలతోపాటు విత్తనాలు సబ్సిడీపై అందిస్తారు.