భూకబ్జా నుంచి కాపాడి ఎస్సీ రైతులకు న్యాయం చేయాలి
భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అఖిల భారతీయ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కుట్ల శంకర్, జిల్లా కార్యదర్శి చిలుకా దేవిదాస్ డిమాండ్ చేశారు.
నార్నూర్ : భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అఖిల భారతీయ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కుట్ల శంకర్, జిల్లా కార్యదర్శి చిలుకా దేవిదాస్ డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ( Narnoor Mandal) మండల కేంద్రంలో వారు మాట్లాడారు. మహాగావ్ శివారులో 70 ఏళ్లుగా ఎస్సీ రైతులు భూమిని సాగు చేసుకుంటున్నారని వివరించారు. అదే గ్రామానికి చెందిన రాథోడ్ హరిచంద్ ఎస్సీల భూమిని దున్ని పంట సాగు చేస్తున్నట్లు మండిపడ్డారు.
రాథోడ్ హరిచంద్ పై రైతులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆదేశాలను బేఖాతర్ చేసి పంట సాగు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని రెవెన్యూ, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఎస్సీ రైతులకు న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు దుర్గే గుణవంత్ రావ్, యశోద బాయి, దుర్గే లీలాబాయి, దుర్గే పురుషోత్తం, జాడే నాగోరావ్, రమాకాంత్, సమతా సైనిక్ దళ్ సభ్యులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

