ఖానాపూర్/పెంబి/బేల, ఆగస్టు 30 : నిర్మల్ జిల్లాలో యూరియా కొరత వేధిస్తున్నది. యూరియా బస్తాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మహిళా రైతులు సైతం గంట ల తరబడి క్యూలైన్లో నిలబడినా దొరకడం లేదు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయానికి 450 యూరియా బ స్తాలు వచ్చాయి. దీంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. పోలీసులు చేరుకుని ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున సరఫరా చేశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పత్తి, మొక్కజొన్న, కంది, వరి పంటలకు యూరియా అవసరం ఉండడంతో గంటల తరబడి వరుసలో నిలబడి యూరియా బస్తాలు తీసుకెళ్తున్నారు.
పెంబి మండలంలో..
పెంబి మండలంలోని గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంస్థ వద్దకు శనివారం రైతులు చేరుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుం చి దాదాపు 400లకుపైగా రైతులు తరలివచ్చారు. కొందరికి మూడు బ్యాగులు, మరి కొంతమందికి రెండు బ్యాగుల చొప్పున 172 మందికి 450 యూరియా బ్యాగులను అందజేశారు. ఇంకా 200 మందికి పైగా రైతులకు ఒక్క యూరియా బ్యాగు కూడా అందకపోవడంతో అసంతృప్తితో ఇంటికి వెళ్లారు.
బేల మండలంలో..
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఆగ్రోస్ సేవ కేంద్రం ఎదుట శనివారం రైతులు బారులుదీరారు. చప్రాల, చంద్పెల్లి, గూడ, మానియార్ పూర్, భెడోడ, ఖోగ్డుర్ గ్రామాలతోపా టు సాత్నాల మండలంలోని సైద్పూర్, మసాలా(కే), తోయగూడ, దుబ్బగూడ, గ్రామల నుంచి దాదాపు 200 మందికిపైగా రైతులు తరలివచ్చారు. కేంద్రంలో 344 యూరియా బస్తాలు ఉండగా.. కేవలం 95 మందికి పంపి ణీ చేశారు. మిగతా వారు నిరాశగా వెనుదిరిగారు. ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.