ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడిలో రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలంటూ నిరసన తెలిపిన 13 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేయడంతో వారు ఈరోజు ఆదిలాబాద్ కోర్టుకు హాజరయ్యారు. గతేడాది డిసెంబర్ 18న రుయ్యాడీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి తలమడుగు పోలీసులు 13 మంది రైతులపై కేసు నమోదు చేశారు.
ఏడాది తర్వాత రైతులకు కోర్టుకు హాజరు కావాలని సమాన్లు అందజేయడంతో వారు ఈరోజు కోర్టుకు వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ విషయంలో నిరసన తెలిపినందుకు ప్రభుత్వ అక్రమ కేసులు బనాయిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా రూ.2లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేశారు