బాసర, అక్టోబర్ 14 : భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మంగళవారం రైతులు పాదయాత్ర నిర్వహించారు. ముందుగా బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆలయం నుంచి నిర్మల్ జిల్లా భైంసా వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నెలలో వరదల వల్ల సుమారు 15 వేల ఎకరాల పంటలు నీట మునిగాయని ఆవేదన చెందాడు.
ఇక, సోయా పంట ఇంటికొచ్చి నెల రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు పాల్గొన్నారు.