ఆదిలాబాద్ : జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ కారిడార్లో భూములు ( Land ) కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ. 50 లక్షలు ఇవ్వాలని రైతులు కోరారు.ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ( Collector ) ను కలిసి వినతి పత్రం అందజేశారు. తాతల కాలం నుంచి తాము భూములను సాగు చేసుకుంటూ పాతి పొందుతున్నామని రైతులు కలెక్టర్కు వివరించారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 12 లక్షలు చెల్లింపు ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు.
చనక కొరట ప్రాజెక్టు ద్వారా తమ భూములకు సాగునీరు అందుతుందని, రెండు పంటలు సాగు చేసుకునే అవకాశం ఉన్న సమయంలో ప్రభుత్వ భూ సేకరణ చేపట్టడం వల్ల తాము నష్టపోవలసిన పరిస్థితి ఉందన్నారు. ఎకరాకు రూ. 50 లక్షలు చెల్లించాలని, పరిశ్రమల్లో భూములు పోతున్న రైతు కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
అభివృద్ధి పేరిట రైతుల భూములను బలవంతంగా లాక్కో వద్దని రైతులు సూచించిన ధరను చెల్లించిన తర్వాతనే భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు గ్రామాల్లోకి వచ్చి సర్వే ఫారాలు నింపి ఇవ్వమంటున్నా రని తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించి ధరను నిర్ణయిస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు.