బోథ్, మే 22 : పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్నపూర్ణగా వెలుగొందిన తెలంగాణ రాష్ట్రం నేడు అసమర్థ కాంగ్రెస్ పాలనలో మగ్గుతున్నదని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. శుక్రవారం బోథ్ మారెట్ యార్డుకు వెళ్లి కొనుగోళ్లు లేకపోవడవంతో రైతుల పడుతున్న బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాయకు మాట్లాడుతూ దాదాపు 80 వేల క్వింటాళ్ల జొన్నలు, 25 వేల క్వింటాళ్ల మకలను కొనుగోలు చేయకపోవడంతో ఇంకా మార్కెట్లోనే ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు, బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు మెడిచేల్మ ప్రవీణ్, గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ రుణ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు రమణ, రైతులు పాల్గొన్నారు.