మందమర్రి/చెన్నూర్ రూరల్/రెబ్బెన, సెప్టెం బర్ 11 : మందమర్రి పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో గల ఆగ్రోస్ రైతు సే వా కేంద్రం వద్ద గురువారం వ్యవసాయ శాఖ అధికారులు పోలీసు పహారాలో యూరియా పంపిణీ చేశారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వ ద్ద యూరియా పంపిణీ చేస్తారన్న సమాచారం మేరకు పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం వరకూ అక్కడే పడిగాపులు కాశారు. 10 టన్నుల (220 బస్తాలు) యూరియా మాత్ర మే రావడంతో ఒక్కో రైతుకు రెండెకరాలకు ఒ క బస్తా చొప్పున పంపిణీ చేశారు. ఉదయం వ చ్చిన తమకు యూరియా అంద లేదని.. వెనుకాల వచ్చిన వారికి పంపిణీ చేశారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా దొరకని వారు నిరాశతో వెనుదిరిగారు.
చెన్నూర్ మండలం పొక్కూర్లో సొసైటీ ఆధ్వర్యంలో రై తులకు యూరియా పంపిణీ చేశారు. 266 యూరియా బస్తాలు రాగా, సుమారు 800 మంది రైతులు క్యూ కట్టారు. సరిపడా యూరి యా రాకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టా రు. ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశారు. ఏడీఏ బానోత్ ప్రసాద్, ఏవో యామిని, ఏఈవో సాగర్, పీఏసీఎస్ సిబ్బంది నరహరి శ్రీనివాస్ ఉన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. ఈ నెల 8న రెబ్బెన పీఏసీఎస్‌కు లారీ లోడ్ రాగా, పంపిణీ చేయక పోవడంతో రాస్తారోకో చేశారు. పోలీసులు, అధికారుల చొరవతో టోకెన్లు కలిగిన రైతులకు యూరియా పంపిణీ చేశారు.
సాయంత్రం వరకు యూరియా పంపిణీ చేయగా.. 43 బస్తాలు మిగిలిపోయాయి. మిగిలిన యూరియా పంపిణీ చేయాలని రైతులు నిత్యం రెబ్బెన పీఏసీఎస్ కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు రాగా, వారికి పీఏసీఎస్ సిబ్బంది సహకరించి బస్తాలు అందించారు. 23 బస్తాలు ఆన్లైన్ కాగా, మరో 20 బస్తాలు ఆన్లైన్ కాలేదు. దీంతో దొంగచాటున యూరియా బస్తాలు నాయకులకు ఇచ్చారంటూ రైతులు సీఈవో శేషారావును నిలదీశారు. విషయం తెలుసుకున్న రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్, ఏవో దిలీప్ అక్కడికి చేరుకొని వారిని సముదాయించారు. కొందరు బెదిరింపులకు పాల్పడి యూ రియా బస్తాలు తీసుకెళ్లారని, ఈ విషయమై రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని సీఈవో శేషారావు తెలిపారు. సీఈవో శేషారావును డీసీవో రాథోడ్ బిక్కు సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.