ఖరీఫ్ (వర్షాకాలం) సాగుకు అన్నదాతలు రెడీ అవుతున్నారు. తెల్లారిందే మొదలు, నాగళ్లు, ట్రాక్టర్లతో పొలంబాట పడుతున్నారు. చేలలో చెత్త, చెదారం, పుల్లలు ఏరి కాల్చుతున్నారు. నాగళ్లు, ట్రాక్టర్ల ద్వారా దుక్కులు సిద్ధం చేస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులు తొలకరి జల్లులు పడగానే పత్తి, కంది, సోయాబీన్ పంటలు వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు కూడా వేసవి దుక్కుల ప్రాముఖ్యత వివరిస్తున్నారు. కొందరు పత్తి విత్తనాలు విత్తుతుండగా.. మరికొందరు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. – భైంసా/దిలావర్పూర్, జూన్ 7

