రెబ్బెన/బెజ్జూర్/దహెగాం/వాంకిడి/పెంచికల్పేట్/కౌటాల/మందమర్రి రూరల్/భీమారం/ జన్నారం/కన్నెపల్లి, సెప్టెంబర్ 22 : రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతూనే ఉన్నారు. నిత్యం పంపిణీ కేంద్రాల వద్దకు చేరుకొని గంటల తరబడి క్యూ కడుతున్నారు. సర్కారు తీరుపై మండిపడుతున్నారు. ఇంకెన్నాళ్లీ గోస అం టూ అసహనం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్నారు.
సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో రైతన్నలు యూరియా బస్తాలు, టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అంతర్రాష్ట్ర రాహదారిపై ధర్నా నిర్వహించారు. రెబ్బెన మండ ల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయానికి 1260 యూరియా బస్తాలు రాగా, రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. ఈ నెల 16, 17తేదీల్లో టోకెన్లు తీసుకున్న రైతులకు పట్టాకు రెండు యూరియా బస్తాలు పంపిణీ చేశారు.
టోకెన్లు లేని రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి యూరియా ఇవ్వాలని, టోకెన్లు ఇవ్వాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇంతకు ముందు టోకెన్లు ఇచ్చిన రైతులకు యూరియా బస్తాలు ఇచ్చిన తర్వాత.. కొత్త టోకెన్లు ఇస్తామని అధికారులు చెప్పడంతో రెండుసార్లు అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నాకు దిగారు. ఎస్ఐ వెంకటకృష్ణ, ఏవో దిలీప్ అక్కడికి చెరుకొని ప్రతి ఒక్కరికీ టోకెన్లు అందించడంతో పాటు యూరియా బస్తాలు కూడా అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
బెజ్జూర్ మండల కేంద్రంలో యూరియా స్టాకు ఉన్నా ఏవో నాగరాజు రైతులకు పంపిణీ చేయడం లేదంటూ రైతులు ఆగ్రహించారు. మన గ్రోమోర్ సెంటర్ వద్ద నిత్యం బారులు తీరినా.. రేపు.. మాపంటూ జరుపుతున్నారని రైతులు మండిపడ్డారు. స్టాకు ఉన్న బస్తాలను పంపిణీ చేయుకుంటే రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. అయినా వ్యవసాయ అధికారి స్పందించకపోవడంతో ప్రధాన కూడలి వద్ద రాస్తారోకో చేశారు. ఎస్ఐ సప్తార్ పాషా అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
మన గ్రోమోర్ సెంటర్లో కేవలం 300 బస్తాలు ఉన్నాయని, రైతులకు కూపన్లు రాసి వెంటనే యూరి యా పంపిణి చేస్తామని ఏవో నాగరాజు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. దహెగాం మండల కేంద్రంలోని గ్రోమోర్ దుకా ణం వద్ద సోమవారం తెల్లవారు జాము నుంచే క్యూ కట్టారు. ఒకటీ రెండు బస్తాలే పంపిణీ చేయడంతో మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. వాంకిడిలోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద వందలాది రైతులు బారులు తీరారు. ఏఈవో రాజేశ్వర్,మన గ్రోమర్ సిబ్బంది, పోలీస్ సహకారంతో అధికారులు కూపన్లు జారీ చేశారు.
ఎకరానికి బస్తా చొప్పున పంపిణీ చేశారు. పెంచికల్పేట్లోని రైతు వేదిక వద్ద బెజ్జూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేస్తున్నట్లు సమాచారం అందడంతో రైతులు ఉదయం ఎనిమిదింటి నుం చే బారులు తీరారు. వారం క్రితమే టోకెన్లు జారీ చేశారు. వారికే యూరియా ఇస్తామని అధికారులు తెలపడంతో.. టోకెన్లు లేని రైతులంతా రైతు వేదిక వద్దకు వచ్చిన ఏవో మనీషా వాహనాన్ని అడ్డుకున్నారు. రైతులకు కనీసం ఒక బస్తా చొప్పున అయినా అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయినప్పటికీ కొందరికే బస్తాలు ఇవ్వడంతో మిగ తా వారు సర్కారు తీరుపై మండిపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కౌటాల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా పంపిణీ చేపట్టగా, కౌటాల, గుడ్లబోరి క్లస్టర్ పరిధిలోని రైతులకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూ కట్టారు.
ఆగస్టులో పట్టా పాసు పుస్తకాలు జిరాక్స్లు ఇచ్చిన రైతులకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. ఇక మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సండ్రోన్పల్లి గ్రామంలోని రైతు వేదిక వద్ద సోమవారం ఉదయం నుంచే రైతులు క్యూ కట్టారు. ఎన్ని ఎకరాలున్నా ఒక్కో రైతు కు ఒకే బస్తా ఇచ్చారు. ఒకే బస్తా ఎలా సరిపోతుందని రైతులు ప్రశ్నించగా, రెండు.. మూడెకరాలకు ఒక బస్తా మాత్రమే ఇవ్వడానికి అనుమతి ఉందని ఏవో కిరణ్మయి తెలిపారు.
ఎస్ఐ రాజశేఖర్ బం దో బస్తు చేపట్టారు. భీమారంలోని గ్రోమోర్ సెంటర్ వద్ద మహిళలు, రైతులు ఆందోళనకు దిగారు. ఎస్ఐ శ్వేత వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. న్నారంలోని మన గ్రోమోర్ దుకాణం వద్ద రైతు లు ఉదయం ఏడిం టి నుంచే క్యూ కట్టా రు. సరిగా సిగ్నల్ లేక ఓటీపీ రావడం లేదం టూ జాప్యం చేయడంతో రైతులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కన్నెపల్లి మండలం మెట్పల్లిలోని రైతు వేదిక వద్ద 260 బస్తాలు రావడంతో ఒక్కో రైతుకు ఒకే బస్తాను ఏఈవో అలేఖ్య అందించారు.