దండేపల్లి,(లక్షెట్టిపేట), జనవరి 6 : ఎన్నికల సమయంలో ఎకరాకు రూ. 15 వేలు ఇస్తా మని చెప్పి, ఇప్పుడు మాట మార్చిన కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ భగ్గుమన్నది. ఈ మేరకు సోమ వారం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టింది. సీఎం ఫ్లెక్సీలను దహనం చేసింది. రైతు ద్రోహి రేవంత్‌రెడ్డి అంటూ నినదించింది. లక్షెట్టిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువైందన్నారు. రైతు భరోసా పేరిట యేటా అన్న దాతలకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని.. ఇప్పుడు రూ.12 వేలు మాత్రమే ప్రకటిం చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల బీఆర్ఎస్ అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, చుంచు శ్రీనివా స్, మాజీ డీసీసీబీ చైర్మన్ తిప్పని లింగయ్య, కౌన్సిలర్లు, నాయకులు, రైతులు ఉన్నారు.
చెన్నూర్, జనవరి 6 : చెన్నూర్ పట్టణంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజా రమేశ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సీఎం ఫ్లెక్సీని దహనం చేశారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని ఏడాది పాటు ఊరించి చివరకు రూ. 12 వేలేనంటూ చేతులెత్తేసిందని మండిపడ్డారు. మాయమాటలు చెప్పి రైతన్నల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రైతాంగానికి క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు ఇచ్చే వరకూ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంత్రి బాపు, మాజీ జడ్పీటీసీ మోతె తిరుపతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లెల దామోదర్‌రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నజొద్దీన్, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, దోమకొండ అనిల్, మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుడు అయూబ్, కోటపల్లి సింగల్ విండో చైర్మన్ సాంబగౌడ్, బీఆర్ఎస్ పార్టీ భీమారం మండల అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్, భీమారం మాజీ ఎంపీపీ సమ్మయ్య, మందమర్రి టీబీజీకేఎస్ నాయకుడు మేడిపల్లి సంపత్, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, నాయకులు రాంలాల్ గిల్డా, జడల మల్లేశ్, పెండ్యాల లక్ష్మణ్, ఆరీఫ్, మేడ సురేశ్‌రెడ్డి, నయూం, నెన్నల భీమయ్య, ఎనగందుల గోపి, అయిత సురేశ్‌రెడ్డి, రత్న నరేందర్‌రెడ్డి, కొప్పుల రవి, షఫీ, కొండపర్తి వెంకటరాజం, బోగ భారతి, ముత్యాల సత్యవతి పాల్గొన్నారు.
జైపూర్, జనవరి 6 : జైపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజా రమేశ్ ఆధ్వర్యంలో శ్రేణులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. రమేశ్ మాట్లాడుతూ ప్రజాపాలన పేరిట అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను, రైతులకు మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్మూరి అరవిందరావు, నాయకులు అర్నే సమ్మయ్య, బడుగు రవి, మేడిపల్లి సంపత్, మేడి తిరుపతి, జగన్‌గౌడ్, పూదరి మల్లేశ్, సోషల్‌మీడియా ఇన్చార్జి దూట శేఖర్ పాల్గొన్నారు.
జన్నారం, జనవరి 6 : రైతు భరోసా ద్వారా ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్ర రాజారాంరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్, టౌన్ అధ్యక్షుడు బాలసాని శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి సిటిమల భరత్‌కుమార్, వోలాల నర్సాగౌడ్, ఫజల్‌ఖాన్, శ్రీనివాస్, లెక్కల మల్లయ్య, జంగ రవి, జాడి గంగాధర్, జునుగూరి మల్లయ్య,అడెపు లక్ష్మీనారాయణ, శ్రీధర్‌రావు, భరత్‌నాయక్ పాల్గొన్నారు.