దహెగాం : మండలంలోని కల్వాడ గ్రామానికి చెందిన బానోత్ సోమానాయక్(36) శుక్రవారం విద్యుత్ షాక్‌కుగురై మృతి చెందినట్లు ఎస్ఐ రఘుపతి తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సోమానాయక్ ఉదయం పొలానికి నీళ్లు పట్టేందుకు మోటార్‌ను ఆన్ చేసే క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
ఉదయం పొలానికి వెళ్లిన తండ్రి ఇంటికి రాకపోవడంతో అతని కూతురు శైలజ పొలంవద్దకు వెళ్లి చూడగా మోటర్ వద్ద పడిపోయి ఉన్నాడని గ్రామంలోకి వచ్చి సమాచారం అందించింది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామ చేశారు. మృతుడి భార్య రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.