మందమర్రి, నవంబర్ 8 : పట్టణంలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. స్థానిక పాలచెట్టు ఏరియాలో ప్రతి గురువారం కూరగాయల సంత నిర్వహిస్తారు. ఎప్పటిలాగే గురువారం కూడా హోల్‌సేల్ వ్యాపారం చేసే పవన్‌కుమార్ సంతలో చిరు వ్యాపారులకు కూరగాయలు సరఫరా చేసి, సాయంత్రం వారి వద్ద నుంచి తనకు రావాల్సిన డబ్బులను తీసుకున్నాడు.
రాత్రి ఇంటికి వెళ్లి డబ్బులు లెక్కిస్తుండగా, అందులో ఐదు నకిలీ రెండు వందల రూపాయల నోట్లు వచ్చినట్లు పవన్ తెలిపాడు. కాగా, పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు వ్యాపారులు అంటున్నారు. చిరు వ్యాపారులైతే గుర్తించరనే ధీమాతో నకిలీ నోట్లతో వస్తువులను కొనుగోలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.