ఎదులాపురం, జనవరి 4 : ప్రజల కంటి సమస్య దూరం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వైద్యారోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి విడుత 2018, ఆగస్టు 15న ప్రారంభించగా, ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 3, 49,373 మందికి పరీక్షలు చేశారు. 1,23,829 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు.
ఈ నేపథ్యంలో రెండో విడుత వైద్య శిబిరాలు నిర్వహించేందుకు వైద్యశాఖ చర్యలు చేపట్టింది. బుధవారం జిల్లాకు 18 ఆటో రిఫ్రక్షన్ యంత్రాలు వచ్చాయి. వీటిని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ పరిశీలించారు. 33 టీమ్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 21,600 కళ్లద్దాలు జిల్లాకు చేరినట్లు పేర్కొన్నారు.