దళితులు, గిరిజనులకు అండగా ఉండి.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంచిర్యాల గ్రంథాలయ సంస్థ చైర్మన్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ పేర్కొన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఎస్సీ, ఎస్టీల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వారికి వివరించి అందేలా చూస్తానన్నారు. కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తున్నందుకే పదవులు కట్టబెడుతున్నారని చెప్పుకొచ్చారు.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 22 : దళితులు, గిరిజనులకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంచిర్యాల గ్రంథాలయ సంస్థ చైర్మన్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ పేర్కొన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు పంచుకున్నారు.
ప్రవీణ్ : తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ ప్రభు త్వం సముచిత స్థానం కల్పిస్తున్నదనేది మరోసారి స్పష్టమైంది. ఉద్యమకారుడినైన నన్ను మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించారు. అలాగే రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ సభ్యుడిగా మరో అవకాశం ఇచ్చారు. నా మీద నమ్మకంతో పదవి కట్టబెట్టినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఙతలు.
ప్రవీణ్ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాను. కేసీఆర్ మార్గదర్శకత్వంలో అంతిమంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఉద్యమంలో పార్టీ నిర్ణయాలకు కట్టుబడి అంకితభావంతో పనిచేశాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆదేశాలను శిరసావహించి స్థానికంగా పార్టీ బలోపేతానికి కృషి చేశాను. సామాజిక సమీకరణాల ప్రకారం కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తున్నందుకే తనకు పదవులు కట్టబెడుతున్నారు.
ప్రవీణ్ : 2017లో మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియామకమయ్యాను. అప్పటి నుంచి నాకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాను. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశాను. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చి సకల సౌకర్యాలు కల్పించాను. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చాము. భోజన వసతి కల్పించాము. ఇప్పటి వరకు 150 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఊరూరా గ్రంథాలయాలు కార్యక్రమంలో భాగంగా చెన్నూర్ నియోజకవర్గంలో 100 పబ్లిక్ రీడింగ్ రూమ్లను స్థాపించాను. బెల్లంపల్లి, మంచిర్యాలలోని పలు గ్రామాలు, మున్సిపాలిటీల్లోనూ పబ్లిక్ రీడింగ్ రూంలను ఏర్పాటు చేశాం.
ప్రవీణ్ : క్రమశిక్షణ గల కార్యకర్తగా తనను గుర్తించి సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియామకం చేశారు. కమిషన్ అభివృద్ధికి తోడ్పాడునందిస్తాను. మంచిర్యాల జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు, గిరిజనులకు న్యాయం జరిగేలా కృషి చేస్తాను. వారికి ఎప్పుడూ అండగా ఉంటాను. క్షేత్రస్థాయిలో పర్యటించి ఎస్సీ, ఎస్టీ చట్టాల గురించి, ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించి అందేలా చూస్తాను. ఎస్సీ, ఎస్టీల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తా.