తాండూర్ : పరీక్షల పారదర్శకతను ( Examinations ) కాపాడుతూ అన్ని నిబంధనలను అమలు చేయాలని, అభ్యర్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య ( Chandrayya ) సూచించారు. తాండూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన యంగ్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్-2026 ప్రవేశ పరీక్షను ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలోని ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. అనంతరం తాండూరు గ్రామపంచాయతీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్ర మంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పురోగతిని సమీక్షించి సూచనలు చేశారు.
ఎంపీవో అనిల్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ కల్పన, ఆర్ ఐ బొలిశెట్టి పద్మజ, సర్పంచ్ ముడిమడుగుల సరేష్, కార్యదర్శి దొండ దివాకర్ తో కలిసి తక్కువ పురోగతి నమోదు చేసిన బూత్ స్థాయి అధికారులతో సమావేశమై పెండింగ్ లో ఉన్న ఫారాలను ప్రాధాన్యతతో పూర్తి చేసి నిర్దేశిత గడువులోగా వివరాలు డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. ప్రతి ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.