కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో పంచాయతీ ఎన్నికలకు ( Panchayat elections) అధికారులు అంతా సిద్ధం చేశారు. రెండో విడుత ఎన్నికలు ఆదివారం జరుగనుండగా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.
కాసిపేట కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల అధికారులకు, సిబ్బందికి పంపిణీ చేశారు. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల ఉత్తర్వుల కాపీలతో పాటు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, తదితర సామగ్రితో ఎన్నికల సిబ్బంది చేరి ఏర్పాట్లు చేశారు.
మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయతీలు ఉండగా ధర్మారావుపేట పంచాయతీ ఏకగ్రీవం కాగా మిగతా 21 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. 21 పంచాయతీల్లో 64 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 190 వార్డులు ఉండగా 48 మంది ఏకగ్రీవం కాగా 133 వార్డుల్లో ఎన్నికలు జరగనుండగా 349 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉండగా 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి తర్వాత ఫతితాలు ప్రకటించనున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. Panchayat