నార్నూర్, జూలై 28 : డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే సేవలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో నాందేవ్ కాంబ్లే 4వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ జనార్ధన్ పాల్గొని నాందేవ్ కాంబ్లే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాందేవ్ సామాజికంగా, రాజకీయంగా నిస్వార్థంగా అందించిన సేవలను గుర్తు చేశారు.
నాందేవ్ కాంబ్లే కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అతని లక్ష్యం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, మాజీ సర్పంచ్ జ్ఞానేశ్వర్, అన్నా బావ్ సాఠే, సంఘం జిల్లా అధ్యక్షుడు ఉద్ధవ్ కాంబ్లే, తుకారాం మహారాజ్, లోకండే చంద్రశేఖర్, సయ్యద్ ఖాశీం, సుల్తాన్ ఖాన్, మహదేవ్ కాంబ్లే తదితరులున్నారు.