ఆదిలాబాద్: జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువతకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రాక్షన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ , హౌస్వైరింగ్ వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్అసిస్టెంట్ డైరెక్టర్ రఘునాథ్ తెలిపారు. శిక్షణ మూడు నెలల పాటు ఇవ్వడంతోపాటు, శిక్షణ తర్వాత సర్టిఫికెట్లతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. దీనికి పదవ తరగతి నుంచి డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులన్నారు.
శిక్షణతో పాటు స్టేషనరీ, యూనిఫామ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. కుల, ఆదాయ, నివాస ధృవీకరణపత్రాల జిరాక్స్‌లతో ఈనెల30వ తేదీలోపు జిల్లా కేంద్రంలోని వైటీసీ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 790414049 ఫోన్ నంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు.