దస్తూరాబాద్ : విద్యుత్‌ను (Electricity) వృథా చేయవద్దని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ ఈ జనార్దన్ రావు (EE Janardhan Rao) అన్నారు. మండలంలోని రేవోజిపేట గ్రామంలో సోమవారం వినియోగదారులకు భద్రత, సమస్యలపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ను వృథా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారవుతామన్నారు.
ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపుపై అవగాహన అవసరమన్నారు. ఇంధన పొదుపు వల్ల డబ్బు ఆదా చేసుకోవచ్చని సూచించారు. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయడం వల్ల రెండు యూనిట్లు ఉత్పత్తి భారం తగ్గుతుందని అన్నారు. విద్యుత్ అవసరం లేని సమయంలో స్విచ్చాఫ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాస్‌ను నాయకులు, గ్రామస్థులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఐలయ్య, రాజు నాయక్, శరత్ రెడ్డి, సత్తన్న, శ్రీనివాస్, కొమురయ్య, మహేష్ పాల్గొన్నారు.