మంచిర్యాలటౌన్, జూలై 9 : కేంద్రప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం మంచిర్యాలలో విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్, రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మంచిర్యాలలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు, సిబ్బంది ఈ నిరసన చేపట్టారు.
మంచిర్యాల సర్కిల్ జేఏసీ చైర్మన్ బొమ్మ సత్తిరెడ్డి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని విద్యుత్ ఉద్యోగులు కేంద్రం విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ అంశం లో అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ 220 రోజులుగా కుటుంబ సమేతంగా సమ్మె చేస్తున్నారని, వారికి మద్ధతుగా తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.
భవిష్యత్‌లో కేంద్రం విద్యుత్ సంస్థలను ప్రైవేట్ చేయాలని చూస్తే రాష్ట్ర జేఏసీ పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల సర్కిల్ జేఏసీ కన్వీనర్ రమేశ్, కోచైర్మన్ జాడి విలాస్, కోకన్వీనర్ నూక రాజశేఖర్, ఎస్ఈ ఉత్తమ్‌జాడే, జేఏసీ నాయకులు దుండె కొండయ్య, అబ్దుల్ ఖలీమ్, రాచకొండ వెంకటేశ్వర్లు, శరత్, సాయిక్రిష్ణ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌లో ధర్నా
కాగజ్‌నగర్, జూలై 9: కాగజ్‌నగర్ పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం ఎదుట బుధవారం విద్యుత్ శాఖ ఉద్యోగులు భోజన సమయంలో విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ ఇర్ఫాన్ అహ్మద్, 1104 యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్, 327 యూనియన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు జగన్మోహన్, శ్రీనివాస్, రమేశ్, మురళీ, రామకృష్ణ, ప్రవీణ్, జనార్దన్, కిషన్,ఆంజనేయులు, ధర్మయ్య, శ్రీదేవి పాల్గొన్నారు.