తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ( Elections ) నామినేషన్ స్వీకరణకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు, అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లు, ఫర్నిచర్, భద్రతా చర్యలను తనిఖీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో సాగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. నామినేషన్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్ కూడా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల సహాయ అధికారులు ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ జ్యోత్స్నా, మండల ప్రత్యేక అధికారి, జడ్పీటీసీ ఆర్వో కటకం అంజయ్య, ఎంపీటీసీ ఆర్వోలు సుష్మ, మల్లేశం శ్రీనివాస్, ఎంపీవో అనిల్ కుమార్, తాండూర్, మాదారం ఎస్సై లు కిరణ్ కుమార్, సౌజన్య, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.