తాండూర్ : గ్రామపంచాయతీ రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు ( Panchayat Polling ) సర్వం సిద్ధం చేసినట్లు సహాయ ఎన్నికల అధికారి, తాండూర్ ఎంపీడీవో శ్రీనివాస్ ( Srinivas ), తహసీల్దార్ జ్యోత్స్న తెలిపారు. ఆదివారం జరిగే సర్పంచ్( Sarpanch ) , వార్డు సభ్యుల( Wardmember) ఎన్నికలకు మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 144 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

మూడు డివిజన్లు, 6 రూట్లు, 15 మంది రిటర్నింగ్ అధికారులు, 166 మంది ప్రోసిడింగ్ అధికారులు, 245 మంది ఓఈవోలు, అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు స్టేజ్-2 ఆర్వోలు మొత్తం 426 మంది విధులు నిర్వహించనున్నారని వెల్లడించారు. ఎన్నికల్లో భాగంగా పోలీస్ శాఖ తరపున పటిష్ట బందోబస్తులో భాగంగా ఏసీపీ, ఇద్దరు సీఐలు, పది మంది ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్లు, పోలీసు సిబ్బంది, ఎస్జీ సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు, ఏఆర్ సాయుధ దళం మొత్తం 100 మంది సిబ్బందితో ఏర్పాటు చేవామని పేర్కొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఏసీపీ రవికుమార్

ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. అన్ని ఏర్పాట్లను సకాలంలో పుర్తిచేసుకోవాలని అధికారులకు సూచించారు. పోలింగ్ రోజు విధులు నిర్వహించే అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యటించి పోలీసు సుబ్బందికి పలు సూచనలు చేశారు.