నార్నూర్ : పంచాయతీ ఎన్నికల ( Elections ) ప్రక్రియల్లో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ( Collector Rajarshi Shah ) అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నార్నూర్, గాదిగూడ మండలాల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్తో కలిసి పరిశీలించారు.
ఎన్నికలకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశ నియమ నిబంధనలకు అనుగుణంగా అమలు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ సిబ్బందికి అందించాల్సిన ప్రణాళికపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జాడి రాజలింగం, ఎంపీడీవోలు పుల్లారావు, శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.