అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించాలని నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
- బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాయమాటలు నమ్మద్దు
- నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
- మామడ మండలంలో విస్తృతంగా ప్రచారం
మామడ, నవంబర్ 23 : పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించాలని నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పరిమండల్, జయరాంతండా, జగదాంబతండా, న్యూలింగంపెల్లి, కొరిటికల్, మామడ, న్యూసాంగ్వీ, బండల్ ఖానాపూర్, పోతారం, అనంతపేట్, కమల్‌కోట్, జమ్లానాయక్ తండా, ఆదర్శనగర్ గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మంత్రికి మహిళలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ బీజేపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు చెప్పే మాయమాటలు ప్రజలు నమ్మవద్దన్నారు. బీజేపికి ఓటు వేస్తే వృథా అవుతుందని, అభివృద్ధి చేసే నాయకులను గుర్తించి అమూల్యమైన ఓటును సరైన అభ్యర్థికి వేయాలన్నారు. నిర్మల్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని వివరించారు. నిర్మల్‌కు తను మెడికల్ కళాశాలను మంజూరు చేయిస్తే, గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన మహేశ్వర్‌రెడ్డి తన రాజకీయ ప్రయోజనల కోసం ఇంజినీరింగ్ కళాశాలను హైదరాబాద్ తరలించారు.
తను భూమి కబ్జా చేశానని బీజేపి అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఒక గుంట భూమి ఆక్రమించిన అని నిరూపించిన రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ విజయలక్ష్మి, డీసీసీబీ డైరెక్టర్ హరీశ్‌కుమార్,డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ లింగారెడ్డి, మంత్రి సోదరుడు దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, సర్పంచ్‌లు హన్మగౌడ్, ముత్యంరెడ్డి, జ్యోతి, రాజన్న, ఎంపీటీసీలు సౌజన్య, రాధ, నిర్మల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగారెడ్డి, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, నాయకులు భూషన్‌రెడ్డి, మహేందర్, నవీన్‌రావు, సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

