 
                                                            కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామానికి చెందిన పోగుల పోసు(70) అనే వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నానికి ( Suicide Attempt) పాల్పడింది. శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం( SI Gangaram ) తెలిపారు.
మల్కెపల్లి ఆశ్రమ పాఠశాలలో స్వీపర్‌గా పని చేస్తున్న పోసు ఇటీవల కిడ్నీలో రాళ్లు రావడంతో ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధ పడుతుందని వివరించారు. ఆరోగ్యం సహకరిస్తలేదని ఆవేదన చెందుతూ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగిందన్నారు.
వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను కాసిపేట ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తీసుకువెళ్లారని తెలిపారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిందని వెల్లడించారు. ఈ మేరకు మృతురాలి కుమారుడు పోగుల శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
 
                            