నిర్మల్ చైన్‌గేట్, జూన్ 24 : సంక్షేమ ఫలాలు అన్ని అట్టడుగు వర్గాల ప్రజలకు చేరే విధంగా అధికారులు కృషి చేయాలని ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక అధికారి ఇలంబర్తి అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ ఫలాలు అట్టడుగు వర్గాల ప్రజలకు చేరే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఇన్నోవేటివ్ ఆలోచనలతో అధికారులు ముందుకు సాగాలన్నారు. అంతకు ముందు ఫొటో గ్యాలరీని కలెక్టర్, అధికారులతో కలిసి తిలకించారు.
ప్రజల సమష్టి భాగస్వామ్యంతో సక్సెస్
ప్రజలు, ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వా మ్యం, అధికారుల కృషితోనే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ విజయవంతమైందని నిర్మల్ కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమా లు, గ్రామ వార్డు సభలు, పెండింగ్ క్లియరె న్సు, అరైవ్ అలైవ్ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సమీక్షలో నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.