Mancherial | తాండూర్, డిసెంబర్ 10 : వైద్య సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి ఎస్ అనిత అన్నారు. తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపైన వైద్యాధికారి, వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా సమయపాలన పాటించడం, గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం, పోలింగ్ స్టేషన్లలో వైద్య సిబ్బందిని అత్యవసర మందులతో ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఆయా పోలింగ్ కేంద్రాలలో నియమించిన వైద్య సిబ్బంది ఉదయం 6 గంటలకి రిపోర్టు చేయాలని పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ సమయమైన తర్వాత వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. యూనిఫామ్ లో ఉండాలని మొబైల్ ఫోన్లను తీసుకువెళ్లరాదని, స్థానిక ప్రజాప్రతినిధులతో దూరంగా ఉండాలని ఎన్నికల కోడ్ ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా 108 సిబ్బంది, ఆర్బీఎస్కే సిబ్బంది వైద్యుల వివరాలను అత్యవసరంగా వాడుకోవాలని తెలియజేశారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు గర్భవతుల నమోదు, టీకాలు, అసంక్రమణ వ్యాధులు, కీటక జనిత వ్యాధుల నివారణ పైన దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యాక్సిన్, మందుల నిల్వలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఝాన్సీ, వైద్య సిబ్బంది, ఆశ ఆరోగ్య కార్యకర్తలు, డీపీవో ప్రశాంతి, సీహెచ్వో వెంకటేశ్వర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.