బెల్లంపల్లి, అక్టోబర్ 11: బెల్లంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని ప్రగతి మెట్లెక్కించారు. మరోసారి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మూడో సారి బరిలో నిలిచారు. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థిగా చిన్నయ్య రెట్టించిన ఉత్సాహంతో మండలాల్లో కలియ తిరుగుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక మండలం చుట్టి వస్తూ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. స్థానికులతో మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వీలైనంత వరకు సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తుండగా, దీర్ఘకాల సమస్యలను కూడా విడుతల వారీగా పరిష్కరించడానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి రోజూ నిర్విరామంగా ప్రజల్లోనే ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి మున్సిపాలిటీ, ఏడు మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీలో రూ. కోటీ 18 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శంకుస్థాపన చేశారు. యార్డులో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.36 లక్షలు, ఆర్వో ప్లాంట్‌కు రూ. 8 లక్షలు, షెడ్ల నిర్మాణం కోసం రూ. 74 లక్షలతో నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతి వార్డుకు రూ.40 లక్షలు మంజూరయ్యాయి. ప్రతి వార్డుకు స్వయంగా వెళ్లి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 25 లక్షలతో యాదవ సంఘం భవనం, రూ. 25 లక్షలతో గంగపుత్ర సంఘం భవనం, రూ. 50 లక్షలతో షాదీఖానా నిర్మాణం, రూ.25 లక్షలతో కాపు సంఘం, రూ.25 లక్షలతో విశ్వబ్రాహ్మణ భవన్, రూ. 35 లక్షలతో ఈద్గా ప్రహారీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. సింగరేణి స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారికి పట్టాలను అందించారు. తానే స్వయంగా వాడవాడలా తిరుగుతూ పట్టాలు అందించే ప్రక్రియను పూర్తి చేశారు.
మండలంలోని చౌటపల్లి, రాజీవ్‌నగర్, బోయపల్లి, రేచినీ, తాండూర్, మాదారం, మాదారం త్రీ ఇైంక్లెన్, నీలాయపల్లెలో రూ. 14 కోట్ల నిధులతో బీటీ, సీసీ రోడ్డ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. తాండూర్, మాదారం లలో రూ. 20 లక్షల చొప్పున ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
మండలంలోని ముత్యంపల్లి, దుబ్బగూడెం బీటీ రోడ్డుకు రూ. కోటీ ఐదు లక్షల ఐటీడీఏ, ఆర్ అండ్ బీ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సోనాపూర్, నాయకపు గూడ నడుమ ఐటీడీఏ రూ. 70 లక్షలతో బీటీ రోడ్డు, దేవాపూర్‌లో రూ. 39లక్షలతో సీసీ రోడ్డు, సందల్ పహా డ్ గ్రామంలో డీఎంఎఫ్టీ రూ. 24 లక్షలతో సీసీ రోడ్డు, పెద్దనపల్లిలో రూ. 10 లక్షలు, కోమటిచేనులో రూ. 15 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులను కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఆయా పంచాయతీల్లో రూ. 20 లక్షల చొప్పున ఐటీడీఏ నిధులతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. రూ.18 లక్షల చొప్పున గ్రామ పంచాయతీల పరిధిలో మహిళా సమాఖ్య భవనాలకు, కోనాపూర్‌లో రూ. 20 లక్షలతో పాఠశాల భవన నిర్మాణ పనులను ప్రారంభించారు.
మండలంలో రూ.కోటీ 90 లక్షలతో అన్ని గ్రామపంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీల్లో రూ. 90 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో సీసీ రోడ్లు నిర్మాణాలను ప్రారంభించారు.
కన్నెపల్లి మండల కేంద్రంలో రూ. 31 లక్షలతో ఎమ్మార్సీ భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో రూ. 35 లక్షలు, టేకులపల్లి, ముత్తాపూర్లో రూ. 10 లక్షల నిధులతో, ఆనందపూర్ గ్రామంలో రూ. 5 లక్షల నిధులతో సీసీ రోడ్డును ఎమ్మెల్యే కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు.
వేమనపల్లి మండలంలో జీవో 59 కింద 63 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే అందించారు. జిల్లెడలో రూ.18 లక్షల నిధులతో సీసీ రోడ్డుకునిర్మాణానికి శంకుస్థాపన చేశారు.