మిజాంగ్ తుఫాన్ ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. పల్లెలే కాదు.. జిల్లా కేంద్రం కూడా మరో కశ్మీరాన్ని తలపించింది. శుక్రవారం ఉదయం 8 గంటలు దాటినా, దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో రహదారిపై లైట్ల వెలుతురులో నెమ్మదిగా కదిలే పరిస్థితి నెలకొంది. జిల్లాకేంద్రంతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. బయటకు రావాలంటేనే ప్రజానీకం వణికిపోతున్నది. ఎన్హెచ్ 44ను కూడా పొగమంచు కప్పేసింది.
మిజాంగ్ తుఫాన్ ప్రభావం, చలికాలపు వేళ ఆదిలాబాద్ పట్టణంలో ఉదయం ఇండ్లు, కార్యాలయాలు మంచు తెర కప్పుకున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టర్, ఎన్టీఆర్ తదితర చౌరస్తాలన్నీ పొద్దున దట్టంగా మంచు కమ్మి ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన వద్ద శుక్రవారం ఉదయం ఇలా పొగమంచు వెనుక దాగింది.
– ఎదులాపురం/ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 8