దస్తూరాబాద్ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రమేష్ (MPDO Ramesh) పోలింగ్ కేంద్రాల ఓటర్ల ముసాయిదా జాబితాను (Draft voter list ) ప్రదర్శించారు. మండలంలోని ఐదు ఎంపీటీసీ (MPTC) స్థానాలలో మొత్తం 12,968 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఓటర్ జాబితా పై అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను వెలువరిస్తామని పేర్కొన్నారు.
నేటి నుంచి ఈ నెల 13 వ తేదీ వరకు అభ్యంతరాలను ( Objection ) స్వీకరించి,14 వ తేదీ తుది ఎంపిక జాబితాను విడుదల చేయునట్లు తెలిపారు . 12,968లో పురుషులు(Male) 6290, మహిళలు(Female) 6677, ఇతరులు ఒకరు ఉన్నారని వివరించారు.
భుత్కూర్ ఎంపీటీసీ పరిధి లో 3 గ్రామ పంచాయితీలు ఉండగా అందులో 2,345 మంది ఓటర్లు, దస్తూరాబాద్ ఎంపీటీసీ పరిధి లోని 3 గ్రామ పంచాయతీ లలో 2,823 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. బుట్టపుర్ ఎంపీటీసీ పరిధిలోని 2 గ్రామ పంచాయతీ లలో 2,365, మున్యాల ఎంపీటీసీ పరిధి లో 2 గ్రామ పంచాయతీ లలో 2,283, రేవోజిపేట ఎంపీటీసీ పరిధిలో 3 గ్రామ పంచాయతీలలో 3,152 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు.