నార్నూర్, ఆగస్టు 18 : వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జితేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ముక్తాపూర్ గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్న అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో బయటికి వెళ్లాలన్నారు.
అలాగే ఇంటి ఆవరణలో వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని, అపరిశుభ్రత లోపించడంతో వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉంటాయన్నారు. పరిశుభ్రతతో పాటు కాచిన వేడి నీటిని తాగాలన్నారు. గ్రామాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో హెచ్ఈఓ తులసీదాస్, హెల్త్ సూపర్వైజర్ చరణ్ దాస్, సత్యవ్వ, వైద్య సిబ్బంది గణేష్ కుమారి, సింధు, కైలాస్, ఈశ్వర్, దినేష్, ఆశ కార్యకర్తలు భీం బాయి, శ్రీలత, అనిత తదితరులున్నారు.