తాంసి, నవంబర్ 21 : సీఎం కేసీఆర్ నాయ కత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నదని, వారెంటీ లేని పార్టీల గ్యారెంటీ లను వారు నమ్మరని మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని వామన్ నగర్, అంబుగాం, గిరిగామ, లింగూడ, అట్నంగూడ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు వన్నెల అశోక్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు అమలు చేయనోళ్లు.. ఇక్కడ చేస్తరా..? ఒకసారి ఆలోచించాలి. మన బతుకులు ఆగం చేసేందుకే వాళ్లు వస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి జాదవ్ అనిల్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాటిపల్లి రాజు, ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డి, వైస్‌ఎంపీపీ ముచ్చ రేఖ- రఘు, సర్పంచ్‌లు సదానందం, వెంకన్న, తూర్పుబాయి యశ్వంత్, గజానన్, అండె అశోక్, అలాలి జ్యోతి నర్సింగ్, భరత్, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, కాంత్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ గోవర్ధన్ రెడ్డి, విలాస్, గడుగు గంగన్న, సంజీవ్, పరమేశ్, వెంకట రమణ, మహేందర్, నాగిరెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే సంక్షేమ పాలన
బోథ్, నవంబర్ 21: అభివృద్ధి, సంక్షేమ బీఆర్ఎస్తోనే సాధ్యమని జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలను నేరుగా అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే, సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు . నాడు చేయని అభివృద్ధి నేడు గ్యారంటీగా అమలు చేస్తామని చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా జాదవ్ అనిల్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరో బృందంలో సర్పంచ్ సురేందర్‌యాదవ్, అల్లకొండ ప్రశాంత్, సుభాష్, బొడ్డు శ్రీనివాస్, సోలంకి సత్యనారాయణ, తూం సూర్యం, వెంకటేశ్, రాకేశ్, రవి, మల్లేశ్, ఇమ్రాన్, ఓస సాయి పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగమే
బజార్హత్నూర్, నవంబర్ 21: కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఓటేస్తే రాష్ర్టాన్ని ఆగం చేస్తారని బీఆర్ఎస్ మండల యువజన సంఘం అధ్యక్షుడు డుబ్బుల చంద్రశేఖర్ ప్రజలకు సూచించారు. మంగళవారం మండలంలోని మహదేవునగర్, చందునాయక్‌తండా, వంజరభూతాయి గ్రామల్లో సర్పంచ్‌లు పడ్ జ్ఞానేశ్వర్, అనిత ఆధ్వర్యంలో గడగడపకూ వెళ్లి నమూనా ఈవీఎంతో కారు గుర్తు అభ్యర్థి అయిన బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌కు ఓటు వేసి భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కానిందె ఉద్దోవ్, జానార్దన్, రమణ, కిశోర్, భోజన్న, చిట్టిగౌడ్, చాకటి మహేశ్, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుడిహత్నూర్ మండలంలో..
గుడిహత్నూర్, నవంబర్ 21 : మండలంలోని డోంగర్‌గామ్, ముత్నూర్ గ్రామాల్లో సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు జీ తిరుమల్‌గౌడ్, జిల్లా, మండల నాయకులు జాదవ్ రమేశ్, సర్పే సోంబాయి ఆధ్వర్యంలో గడపగడపకూ ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మారుతి, ఆశన్న యాదవ్, ఎండీ గఫార్, దోమకొండ సుధాకర్, మాధవ్, రావణ్ముండె, గోకుల్, పాటిల్ రాందాస్, ససానే సిద్ధార్థ్, గౌస్, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ, నవంబర్ 21 : మండల కేంద్రంతో పాటు ఇచ్చోడతండాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌కు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టో గురించి వివరించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె సుభాష్, బీఆర్ఎస్ నాయకులు దయాకర్, రమేశ్, పాండు పాల్గొన్నారు.
నేరడిగొండ మండలంలో..
నేరడిగొండ, నవంబర్ 21 : మండలంలోని దర్భ, దర్భతండా, రేంగన్వాడీ, సుర్దాపూర్, తేజాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ విశాల్‌కుమార్, నాయకులు రాజేశ్వర్, ఆత్రం భీంరావ్, మదన్‌సింగ్, అడెల్లు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి ఆదరించండి
తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిచాలని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ కోరారు. మంగళవారం సొనాల మండలం చింతల్బోరి, పుణ్యానాయక్తండా, పార్డి(కే) గ్రామాల్లో సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, చింతల్బోరి సర్పంచ్ బుర్కే రాందాస్, పార్డి-కె సర్పంచ్ పార్వతి బాయితో కలిసి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా జాదవ్ అనిల్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు జమున-రాజేశ్వర్, సునీత-రోహిదాస్, బీఆర్ఎస్ నాయకులు సంతోష్, గణేశ్, బుర్కే గజానంద్, డోక్లె మారుతి, అభిలాష్, సుధీర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, శ్రీనివాస్, ఈశ్వర్, అమృత్ రావ్, భీంరావ్ పాటిల్, నరేందర్, సోమన్న, ఇందల్ సింగ్, గుర్జాల్ సింగ్, సత్యనారాయణ, శంకర్, కృష్ణ , గణేష్, రాజు, సంగ్రామ్, రాము, తదితరులు పాల్గొన్నారు.