నెన్నెల, ఏప్రిల్20 : ఎండలు ముదురుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధాకారి డాక్టర్ సుబ్బారాయుడు వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం నెన్నెల ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. వైద్య సిబ్బందికి సలహాలు-సూచనలు చేశారు.
ప్రస్తుతం పల్లెల్లో వ్యవసాయ పనులు, ఉపాధి పనులు కొనసాగుతున్నాయని, వడదెబ్బ బారిన పడకుండా రైతులు, కూలీలలకు అవగాహన కల్పించాలన్నారు. పని ప్రదేశాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండదెబ్బ తగిలి హాస్పిటల్కు వచ్చే వారికి సకాలంలో వైద్యం అందించాలన్నారు. ఆయన వెంట పీవో డాక్టర్ శివ ప్రతాప్, పీహెచ్సీ వైద్యుడు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.