బజార్హత్నూర్, జూలై 5 : గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మండలంలో 654 మంది అడవి బిడ్డలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతుబంధుతోపాటు సంక్షేమ పథకాలు రావడం సంతోషమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ తిరుమల, జడ్పీటీసీ నర్సయ్య, తహసీల్దార్ సోము, ఎంపీడీవో రాధ, బీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం పాల్గొన్నారు.
దశాబ్దాలుగా పోడు భూముల పట్టాల కోసం ఎదురు చూసిన గిరిజనుల కల నెరవేరిందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోని రైతు వేదిక భవనంలో కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి 582 మంది గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వడంతో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు వర్తిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణరెడ్డి, జడ్పీటీసీ సంధ్యారాణి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు తాహెర్‌బిన్ సలాం, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ రుక్మణ్‌సింగ్, సంజీవ్‌రెడ్డి, సర్పంచ్ సురేందర్‌యాదవ్, వైస్ ఎంపీపీ లింబాజీ, ఎంపీడీవో లక్ష్మణ్, ఎంపీవో జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ గిరిజనుల పక్షపాతి అని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలోని సూర్య గార్డెన్లో జడ్పీటీసీ జాదవ్ అనిల్‌తో కలిసి పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గిరిజనులకు పట్టాలు అందడంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. జడ్పీటీసీ జాదవ్ అనిల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు చెప్పిన మాట తప్పి మళ్లీ ఓట్ల కోసం పోడు పట్టాలు ఇస్తామని వస్తున్నారని, వారిని నమ్మవద్దని తెలిపారు. అనంతరం మండలంలో 865 మందికి పోడు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ పెంట వెంకటరమణ, ఉప సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నానక్‌సింగ్, సీనియర్ నాయకులు సయ్యద్ జహీర్, కమల్‌సింగ్, ఏఎంసీ మాజీ చైర్మన్ దావుల భోజన్న, తిత్రే నారాయణసింగ్, వడూర్ ఎంపీటీసీ పండరి, తహసీల్దార్ పవన్‌చంద్ర, ఎంపీడీవో అబ్దుల్సమద్ పాల్గొన్నారు.