దస్తూరాబాద్ : దస్తురాబాద్ మండల కేంద్రంలోని ఐకేపీ( IKP ) కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా ( Dharna ) నిర్వహించింది . సోమవారం సంఘం నాయకులు మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు.
రైస్ మిల్లు యజమానులు ( Rice Millers Owners ) ఒక్కో సంచికి మూడు కిలోలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రైస్ మిల్లర్స్ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం తూకం వేసిన తరువాత రైతులందరికీ రసీదులు ( Recipt ) ఇవ్వాలని, , కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టే విధంగా రైతులు పోరాడాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్ కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు నష్టపోకుండా చూడాలని, రైతులను దోపిడీ చేస్తున్న రైస్ మిల్లర్స్ పై కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జాజి మొగ్గ లింబాద్రి, బరిగెల గంగాధర్ , చించోలి రాములు, నన్నకుమార్ , జాజిమొగ్గ ఆశన్న తదితర రైతులు పాల్గొన్నారు.