ఆసిఫాబాద్ టౌన్, సెప్టెంబర్ 13 : సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు దిగుతామని మున్సిపాలిటీ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణమాచారి, కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 2న ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా అవతరించిదన్నారు. సిబ్బందికి పెండింగ్ ఏరియర్స్ చెల్లించాలని, ఇతర మున్సిపాలిటీల్లో మాదిరిగానే కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మాట్ల రాజు, కార్యదర్శి తోట సమ్మయ్య, కోశాధికారి ఇగురపు బాపురావ్, నాయకులు లక్ష్మి, పద్మ, సిడం మోతీదాం, ఇస్తారి, సాగర్, శ్రీనివాస్, బాలేశ్ పాల్గొన్నారు.