ఎదులాపురం, మార్చి 23 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీల కోసం పొందుపరిచిన అంశాలు ఈ బడ్జెట్ సమావేశాల్లో అమలు చేసేలా ప్రకటన చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు. సోమవారం అంగన్వాడీల సమస్యలు పరిషరించాలనే డిమాండ్‌తో యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు.
పోలీసులు వారిని సముదాయించడంతో గేటు ఎదుట నిరసన తెలిపారు. అనంతరం లోనికి వేళ్లేందుకు యత్నించగా టూ టౌన్ సీఐ నాగరాజు వారిని నిలువరించడంతో కొంత ఉద్రికత్త నెలకొన్నది. అనంతరం పది మందిని లోనికి అనుమతించడంతో వారు లోనికి వేళ్లి కలెక్టర్‌కు సమస్యలపై వినతివ్రతం అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అశన్న, అంగన్వాడీ యూనియన్ నాయకులు సుజాత, సునీత, ముక్త, కవిత, స్వర్ణలత పాల్గొన్నారు.
అంగన్వాడీల ఆందోళన
నిర్మల్ చైన్‌గేట్, మార్చి 23 : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచాలని కోరుతూ సోమావారం నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ సీఐటీయూ నిర్మల్ జిల్లా అధ్యక్షులు లలిత మాట్లాడుతూ.. సిబ్బందికి రూ.18 వేలు వేతనం పెంచాలన్నారు. ఈ ఈ కార్యక్రమంలో నాయకులు భాగ్య, వనజ, కవిత, చంద్రకళ, విజయ, రత్నమాల, పెద్దమ్మ పాల్గొన్నారు.