ఇంద్రవెల్లి : నాగోబాకు మెస్రం వంశీయులు ఆదివారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర ( Nagoba Jatara ) కు సోమవారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి నాగోబాను దర్శించుకున్నారు. మహాపూజల తరువాత 260 మంది కొత్త కోడళ్లకు భేటింగ్ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగోబాతోపాటు సతిక్ దేవతలకు దర్శించుకునే భాగ్యం కల్పించారు.



22 కీతలకు చెందిన కొత్త కోడళ్లు నీటి కోనేరు నుంచి నీటిని తెచ్చి గోవాడ్లో శుద్ధిని నిర్వహించారు. ఆలయం వద్ద అవ్వాల్ దేవతకు కొత్తకోడళ్లు పూజలు చేసి దీక్షలు విడిచారు. మహిళల ఆధ్వర్యంలో నైవేద్యంతో కుడిన వెదురు బుట్టల వద్ద దీపాలు వెలిగించి సంప్రదాయ పూజలు చేశారు.