SP Akhil Mahajan | ఆదిలాబాద్ : చదువుతూనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్పీ అఖిల్ మహత్యం అన్నారు. గాదిగూడ మండలం పిప్రి, షేకు గూడ, పూనగూడ గిరిజన గ్రామాల్లో శనివారం నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఎస్పీ మాట్లాడారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా అగ్ని వీర్ ఉద్యోగాలకు శిక్షణ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
యువకులు పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేటు ఉద్యోగాలు చేసి ఉపాధి పొందాలని సూచించారు. యువకులను క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. గిరిజనులు అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని సూచించారు. బాబాల వద్దకు పోయి వ్యాధులకు చికిత్స తీసుకోవద్దని సూచించారు.
ప్రతీ గ్రామంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్‌ను నియమిస్తున్నామని, ఏమైనా సమస్యలు వస్తే 100 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. యువత మద్యం గంజాయి బానిస కాకుండా ఉండాలని, గంజాయి సాగు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.