నేరడిగొండ, జూన్ 9: టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండలంలోని రాజులతండా వాగుపై రూ.50 లక్షలతో చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ గంగామణి, జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, వైస్‌ఎంపీపీ మహేందర్ రెడ్డి, కుమారి గ్రామ పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, ఏఎంసీ మాజీ చైర్మన్ తిత్రే నారాయణ సింగ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ శివారెడ్డి, సర్పంచ్‌లు వెంకట రమణ, విశాల్ కుమార్, జాదవ్ సుభాష్, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీవో అబ్దుల్ సమద్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.