దిలావర్పూర్ డిసెంబర్ 2 : తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ప్రభుత్వం సవిత ప్రేమ చూపు తున్నదని దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. దిలావర్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ పాల్దె అక్షర అధ్యక్షతన మండ ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎజెండాల్లో అంశాల వారీగా మంత్రి అల్లోల సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ దేశంలోని ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై వివక్ష చూపుతున్నదని విమర్శించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ. 400 కోట్లతో నిజామాబా ద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా రైతుల కోసం ఆయిల్‌పాం ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. పెద్ద సంఖ్యలో రైతులు ఆయిల్ పామ్ పంట సాగుపై దృష్టి సారించాలని పేర్కొ న్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మంజూరైన డబుల్ బెడ్ రూం ఇండ్లను జనవరి 16 వరకు పూర్తి చేసి అర్హులకు అందిస్తామని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా అన్ని గ్రామాలకు తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు.
జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సుభాష్ రావు, ఎంపీడీవో మోహన్, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణా రెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, నిర్మల్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్ ధర్మాజీ గారి రాజేందర్, మండల ఉపాధ్యక్షుడు బాబురావు, మండల కోఆప్షన్ సభ్యుడు అన్వర్‌ఖాన్, ఎంపీ టీసీలు ఏలాల అమృత, డీ గంగవ్వ, రవీందర్ రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు తహసీల్దార్ కరీం, కస్తూరి శంకర్, ఏవో స్రవంతి ఏఈ శ్రీనివాస్, వైద్యుడు శ్యామ్‌కుమార్, పశు వైద్యాధికారి నందకుమార్, ఎంపీవో అజీజ్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, నవంబర్ 2 : రూ.10 లక్షల 50 వేల సొంత ఖర్చులతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూర్చున్న కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ మండలం చించోలి బీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ కాంస్య విగ్రహ నమూనా చిత్రపటా న్ని మంత్రి ఆవిష్కరించారు. రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకటరాంరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, కృష్ణంరాజు, టీఎన్జీవో అధ్యక్షుడు ప్రభాకర్, బొడ్డు లక్ష్మణ్, చించోలి బీ సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ వెంకటరమణారెడ్డి, నాగయ్య, కొంతం మురళి, ముజ్జ రాజన్న, దేవర రఘు, వెంకటస్వామి, బెబ్బులి ప్రసాద్, ముత్తన్న, సిద్ధ బబ్లు దౌడ సుభాష్ ఉన్నారు.