మందమర్రి రూరల్, జనవరి 27 : ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్నది.. రైతు రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తా రు. రైతుబంధు డబ్బులు ఇంకెప్పుడిస్తారు’ అంటూ మండల సర్వసభ్య సమావేశంలో స భ్యులు నిలదీశారు. మందమర్రి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎం పీపీ గుర్రం మంగ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ఈ సమావేశం రసాభాసగా మా రింది. సభ్యులు సమస్యలపై అధికారులను నిలదీశారు.
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. కేసీఆర్ సర్కారు పామాయిల్ సాగునుప్రోత్సహించిందని, ఇక్కడ వెంటనే పరిశ్రమ ఏర్పాటు చే యాలని సభ్యులు కోరారు. కేసీఆర్ సర్కారు మాదిరిగానే సకాలంలో రైతు బంధు డబ్బు లు విడుదల చేయాలని, వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. వైస్ ఎంపీపీ రాజ్‌కుమార్, జడ్పీటీసీ వేల్పుల రవి, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రావు, కో ఆప్షన్ నసీరొద్దీన్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఎంపీడీవో శశికళ, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంఈవో జాడి పోచయ్య, వైద్యాధికారి రమేశ్ పాల్గొన్నారు.