తాంసి, ఏప్రిల్ 5 : పొన్నారి గ్రామానికి చెందిన కౌలు రైతు అశిలి పోచన్న(35) ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు. పోచన్న ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని టమాట, వంకాయ, బెండకాయలు, బబ్బరి వంటి కూరగాయలు పండిస్తున్నాడు. రోజు ఉదయం, సాయంత్రం కూరగాయలను ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ పట్టణంలోని రైతుబజార్లో విక్రయిస్తాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా తన ద్వికచక్రవాహనంపై కూరగాయలను రైతుబజార్‌కు తీసుకెళ్లాడు.
రాత్రి కావడంతో తను అమ్మే స్థలం వద్ద విద్యుత్ బల్బు ఏర్పాటు చేసుకుంటున్నాడు. విద్యుత్‌ను సరి చేస్తున్న క్రమంలో షాక్ తగిలి పడిపోయాడు. చుట్టూ పక్కల ఉన్న రైతులు వెంటనే రిమ్స్‌కు తలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే కౌలు రైతు మృతి చెందడని, బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని పొన్నారి రైతులు డిమాండ్ చేశారు. పోచన్నకు భార్య మమత, కూతురు అనీష ఉంది.